ఆస్ట్రియాపై స్పెయిన్ ఘనవిజయం
04-07-2026 12:10 AM
లాస్‌ఏంజెలిస్, జూలై 3: ఫిఫా ప్రపంచకప్‌లో స్పెయిన్ ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. రౌండ్ ఆఫ్ 32లో ఆ జట్టు 3-0తో ఆస్ట్రియాను చిత్తు చేసింది. స్పెయిన్ తరఫున మి కెల్ ఒజర్బయాల్ డబుల్ గోల్స్ చేయగా, పెడ్రో పోరోమరో గోల్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో స్పెయిన్ పూర్తి ఆధిపత్యం కనబరిచింది.
పటిష్టమైన డిఫెన్స్‌తో ఆస్ట్రియాను కేవలం ఐదుషాట్స్‌కే పరిమితం చేశారు. ఫిఫా ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లో స్పెయి న్ ఒకటి కంటే ఎక్కువ గోల్స్ సాధించడం 1994 తర్వాత ఇదే తొలిసారి. అటు స్పెయి న్ గోల్ కీపర్ ఉనై సైమన్ 519 నిమిషాల పాటు ఒక్క గోల్ కూడా ఇవ్వకుండా, సైమన్ తొలి గోల్ కీపర్‌గా గిన్నిస్ వరల్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు.






