16 July, 2026 | 12:19 AM

‘సర్’ హెల్ప్‌డెస్క్‌ను సందర్శించిన చింతల

16-07-2026 12:00 AM

బంజారాహిల్స్, జూలై 14 (విజయక్రాంతి): ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోంది. అందులో భాగంగా ఓటర్లకు సహాయకారిగా ఉండేందుకు ఎస్‌ఐఆర్ హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేశారు. బంజారాహిల్స్, వెంకటేశ్వర కాలనీల్లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ లను మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి బుధవారం సందర్శించారు. అక్కడకు వచ్చిన ప్రజలను నేరుగా మాట్లాడారు. వారికి ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఎన్యుమరేషన్ ఫారాలు నింపడంలో సహాయం చేశారు. హెల్ప్ డెస్క్ సిబ్బందికి పలు సూచనలను చేశారు. ఓటర్లకు ఇబ్బంది కలగకుండా ప్రక్రియను సులభతరంగా పూర్తి చేయాలని సిబ్బందిని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరలున్నారు.