మంత్రి శ్రీధర్ బాబును కలిసిన చిన్నమంగళారం గ్రామ నాయకులు
అభివృద్ధి పనులపై సానుకూల స్పందన
మొయినాబాద్ మే 25(విజయ క్రాంతి): జిల్లా ఇంచార్జ్ మంత్రి గౌరవనీయులు దుద్దిళ్ల శ్రీధర్ బాబును చేవెళ్ల అసెంబ్లీ కాంగ్రెస్ ఇంచార్జ్ పామేన భీమ్ భరత్ ఆధ్వర్యంలో చిన్నమంగళారం గ్రామ నాయకులు కలిసి గ్రామ అభివృద్ధికి సంబంధించిన పలు సమస్యలను వివరించారు.ఈ సందర్భంగా చిన్నమంగళారం బ్రిడ్జి నిర్మాణం, సీసీ రోడ్ల నిర్మాణం, పొద్దటూరు-చిన్నమంగళారం రహదారి అభివృద్ధి వంటి కీలక పనుల గురించి మంత్రివర్యులకు వివరించారు.
దీనిపై స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అన్ని అభివృద్ధి పనులను త్వరలోనే ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.మంత్రి సానుకూలంగా స్పందించడంతో చిన్నమంగళారం గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ ఆంజనేయులు గౌడ్, వార్డు సభ్యులు బట్టు నిర్మల మహిపాల్, వల్లూరి రమేష్, గన్నేపాగ పాండు, మాజీ సర్పంచులు బాలమణి రాములు, వాసుదేవులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పి. గోపాల్ రెడ్డి, అచ్చుతా రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ఎస్‌ఎంసీ మాజీ చైర్మన్ బిక్షపతి గౌడ్, విట్టల్, ప్రభాకర్, గోపాల్, రాజు, శివశంకర్, ప్రసాద్, అంజి, చిన్నమంగళారం మరియు గోపులారం గ్రామస్థులు పాల్గొన్నారు.






