24 March, 2026 | 1:10 PM

శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభం

24-03-2026 12:00 AM

బిచ్కుంద, మార్చి 23 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని పుల్కల్ గ్రామంలో సోమవారం  శనగ కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ సంతోష్ పటేల్, విజయ్ భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. ఈ ప్రారంభంతో రైతులకు తమ శనగ పంటకు సరైన కనీస మద్దతు ధర లభించే అవకాశం కలుగుతుందన్నారు. మధ్యవర్తుల సమస్య లేకుండా నేరుగా ప్రభుత్వానికి పంటను విక్రయించే సౌకర్యం రైతులకు అందుబాటులోకి వచ్చిందన్నారు. దళారుల బెడద లేకుండా రైతులు నేరుగా శనగలను కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు.

అదేవిధంగా శనగలు అమ్మే రైతులకు 15 రోజుల్లో డబ్బులు వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తారన్నారు. శనగలను అమ్ముకోవాలనుకునే రైతులు ముందుగా రైతుసేవా కేంద్రంలో సీఎం యాప్ ద్వారా నమోదు చేయించుకోవాలన్నారు. క్వింటా మద్దతు ధర రూ.5,875 లుగా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దీంతో రైతులకు సమయానికి చెల్లింపులు జరగడంతో పాటు, ఆర్థిక భారం తగ్గి లాభాలు పెరుగుతాయి.

ఈ సందర్భంగా సర్పంచ్ సంతోష్ పటేల్ రైతులకు అన్ని విధాలుగా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. విజయ్ భాస్కర్ రెడ్డి కూడా రైతుల సంక్షేమం కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కార్యక్రమం ముగిసిన తర్వాత స్థానికులు వారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, రైతులు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.