20-02-2026 12:00:00 AM
శివాజీ జీవితం ఆదర్శప్రాయం : ఎమ్మెల్యే జీఎంఆర్
సంగారెడ్డి/పటాన్చెరు, ఫిబ్రవరి 19 : మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి వేడుకలు గురువా రం సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. జిల్లాలో పలుచోట్ల శివాజీ విగ్రహాలను ప్రజాప్రతినిధులు ఆవిష్కరించారు. యువకులు ర్యాలీలు నిర్వహించి శివాజీ సేవలను కొనియాడారు.
కాగా పటాన్చెరు మండలం భానూరు గ్రామంలో, ఇంద్రేశం, మున్సిపల్ పరిధిలోని ఐనోలు గ్రామాలలో శివాజీ మహారాజ్ విగ్రహాలకు స్థానిక ఎమ్మె ల్యే గూడెం మహిపాల్రెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివాజీ తన పరిపాలనలో లౌకికవాదానికి పెద్దపీట వేశారని గుర్తు చేశారు. శివాజీ అనుసరించిన పరి పాలన విధానాలు, వ్యక్తిత్వం నేటి తరానికి ఆదర్శప్రాయమని అన్నారు.
భవిష్యత్ తరాలకు శివాజీ ఆదర్శాలను అందించాలన్న లక్ష్యంతో నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ గ్రా మాలు, పట్టణాల పరిధిలో సొంత నిధులతో విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు తెలిపా రు. అనంతరం టాన్చెరు డివిజన్ పరిధిలోని గోకుల్ నగర్ లో సోమవంశి ఆర్య క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శివాజీ జయంతి వేడుకల్లో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, మా ర్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, క్షత్రియ సమాజం నాయకులు సంజీవ్ కాం బ్లీ, నాయకులు వెంకటేష్, ప్రమోద్, మల్లేష్, రాము, రాజు, వినోద్, సమాజం స భ్యులు, సీనియర్ నాయకులు బండి హరిశంకర్, దశరథ్ రెడ్డి, శంకర్ రెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి, రాజి రెడ్డి, శివాజీ జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
గీతం యూనివర్శిటీలో...
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో శివాజీ మహారాజ్ 396వ జయంతి సందర్భంగా ప్రాంగణంలో నెలకొని ఉన్న ఆయన విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. శివాజీ శాశ్వత వారసత్వాన్ని ప్రతిబింబించేలా సాగి న ఈ వేడుకలలో ఆయనను భారతదేశపు గొప్ప యోధ రాజులు, దార్శనిక పాలకుల లో ఒకరిగా గుర్తుచేసుకున్నారు. సైనిక నా యకత్వం మాత్రమే కాకుండా, ఆదర్శప్రాయమైన పరిపాలన, న్యాయం పట్ల నిబద్ధత, అన్ని వర్గాల పట్ల గౌరవానికి కూడా ఆయన ప్రసిద్ధి చెందారని కొనియాడారు.
కార్యక్రమంలో అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డి.ఎస్. రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్‌ఆర్ వర్మ, సమన్వయకర్త ఫిజా అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.