20-02-2026 12:00:00 AM
పాల్గొన్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
సనత్‌నగర్/బడంగ్‌పేట్/కుషాయిగూడ, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి):- దేశం కోసం వీరోచిత పోరా టం చేసిన యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మె ల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్మరించుకున్నారు. ఛత్రపతి శివాజీ 396 వ జయంతి సందర్భంగా సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్‌పేట, రాంగోపాల్‌పేట, సనత్‌నగర్, అమీర్‌పేట డివిజన్లలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే తలసాని పాల్గొని ఛత్రపతి శివాజీకి నివాళులు అర్పించారు.
ఆయా కార్యక్రమాల్లో పద్మారావు నగర్ బీఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్‌గౌడ్, డివిజన్ అధ్యక్షుడు వెంకటేషన్ రాజు, మాజీ కార్పొరేటర్ లు అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, అత్తిలి అరుణ గౌడ్, కిరణ్మయి, డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్‌గౌడ్, మాజీ కార్పొరేటర్ నామన శేషు కుమారి, నిర్వాహకులు గులాబ్ సింగ్, డివిజన్ అధ్యక్షుడు హన్మంతరావు పాల్గొన్నారు.
శివాజీ ఆశయ సాధనకు యువత..
చత్రపతి శివాజీ ఆశయ సాధన కోసం యువత ముందుకు సాగాలని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం రంగారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షు డు షెర్రీ ప్రతారెడ్డి ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ 196వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనం గా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బీ కార్తిక్, పీపీ రవికుమార్, న్యాయవాదులు పి. రామచందర్ రావు సైదయ్య, సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బడంగ్ పేట్ సర్కిల్ పరిధిలో..
బడంగ్‌పేట్, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): బడంగ్ పేట్ సర్కిల్ పరిధిలోని బాలాపూర్ శివాజీ చౌక్ సమీపంలో ఛత్రపతి శివాజీ విగ్రహానికి టిపిసిసి ప్రధాన కార్యదర్శి, బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి దంపతులు నివాళులు అర్పించారు. మాజీకార్పొరేటర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, స్థానికులు పాల్గొన్నారు.
చర్లపల్లిలో..
కుషాయిగూడ, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి) : చత్రపతి శివాజీని నేటి యువత అదర్శంగా తీసుకుని ఆయన అశయాలను కొనసాగించాలని మాజీ ఎమ్మేల్యేలు బేతి శ్రీసుభాష్ రెడ్డి , ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ లు తెలిపారు. చత్రపతి శివాజీ మహరాజు 396 వ జయంతి సందర్భంగా గురువారం చర్లపల్లి డివిజన్ గణేష్ టెంపుల్ కమాన్ వద్ద కర్బెర్ల రాజు అధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
కార్యక్ర మం లో మాజీ కార్పొరేటర్లు బొంతు శ్రీదేవియాదవ్, పజ్జూరి పావనిరెడ్డిలతో కలసి ముఖ్య అతిదిగా పాల్గొని శివాజీ మహరాజు చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. కార్యక్రమంలో ఐలా వైస్ చైర్మన్ తాటి శ్రీనివాన్, వివిధ పార్టీల నాయకులు పాల్గొని పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు.
దుండిగల్‌లో..
కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి 19(విజయక్రాంతి): దుండిగల్ సర్కిల్ పరిధి భౌరం పేట్, శంభీపూర్‌లో దుండిగల్ బీజేపీ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయం తి వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా సర్కిల్ బీజేపీ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి పాల్గొని శివాజీ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం అన్న ప్రసాద వితరణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఎస్ జంగారెడ్డి, బీజేపీ నాయకులు గోనె మల్లారెడ్డి, దమ్మగారి ప్రభాకర్‌రెడ్డి, మురళి యాదవ్ పాల్గొన్నారు.