calender_icon.png 19 February, 2026 | 7:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుండి పాఠశాలలో సైన్స్ ఫెయిర్

19-02-2026 05:39:46 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయ క్రాంతి):మండలంలోని గుండి జెడ్‌పీహెచ్‌ఎస్  పాఠశాలలో మండల విద్యాశాఖ అధికారి రాథోడ్ సుభాష్ ఆధ్వర్యంలో, డ్రీమ్ సొసైటీ సహకారంతో సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. విద్యార్థులు వివిధ శాస్త్రీయ ప్రయోగాలు చేసి తమ ప్రతిభను ప్రదర్శించారు. డ్రీమ్ సొసైటీ జిల్లాలోని పాఠశాలలకు సైన్స్ కిట్లు అందించి, శాస్త్రంపై ఆసక్తి పెంచేలా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఎంఈఓ తెలిపారు. “కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి” అనే ఏ.పీ.జే. అబ్దుల్ కలాం మాటలకు ఇది నిదర్శనమని అన్నారు.పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, ప్రథమ–ద్వితీయ బహుమతులను ఎంఈఓ రాథోడ్ సుభాష్, డ్రీమ్ సొసైటీ వ్యవస్థాపకులు కృష్ణా రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, డ్రీమ్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.