చేవెళ్ల ఎంపీడీవో ప్రాంగణం క్లీన్
‘కలపకు నిప్పు.. పకృతికి ముప్పు’ కథనానికి స్పందన
చేవెళ్ళ మార్చి 13(విజయక్రాంతి): ‘కలపకు నిప్పు ప్రకృతికి ముప్పు‘ అన్న కథనంతో విజయక్రాంతి దినపత్రికలో ఈ నెల ఐదున వెలువడిన శీర్షికకు అధికారులు స్పందించారు. చేవెళ్ల ఎంపీడీవో హిమబిందు ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా చేవెళ్ల ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో పెరిగిన పిచ్చి మొక్కలు గురువారం తొలగించారు.
ఎడారిని తలపించే బెల్లపురాతి గుట్టపై గత 30 సంవత్సరాల క్రితం నాటి అధికారులు వివిధ కార్యాలయ ప్రాంగణాలలో విలువైన మొక్కలు నాటారు. ఆ మొక్కలు కాస్త మానులుగా మారి ప్రజలకు ఆక్సిజన్ నీడనివ్వడం పాటు ప్రభుత్వానికి లక్షల కలప సంపద సమకూర్చాయి. పశువైద్యశాల, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కార్యాలయాలలో టేకు మొక్కలు ఎక్కువగా ఉన్నాయి.
వేప చింత (టామరిండ్),యూకలిప్టస్ మొక్కలు ఉన్నాయి. పిచ్చి మొక్కలు రాలిన చెట్ల ఆకులతో చెత్త పేరుకుపోవడం వల్ల అడవిని తలపిస్తున్నాయి. ఈ కలప సంపద కాపాడాలన్న సంకల్పంతో ఎంపీడీవో హిమబిందు స్పందించారు. ఇందుకు వారిని సిబ్బందితో పాటు ఆఫీసుకు వచ్చే ప్రజలు సైతం అభినందిస్తున్నారు. అయితే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కార్యాలయం, పశువైద్యశాల అధికారులు, పాత తహసిల్దార్ కార్యాలయంలో పేరుకుపోయిన పిచ్చిమొక్కల తొలగించేందుకు ఆ అధికారులు మాత్రం ఇంకా స్పందించలేరు.




