చేతక్ స్క్రీన్ అవార్డ్స్ 2025: ‘ధురంధర్’కు 24 నామినేషన్లు
హైదరాబాద్: ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్‌కు చెందిన స్క్రీన్ అకాడమీ, 2025 సంవత్సరానికి గాను హిందీ సినిమా , ఓటిటి కంటెంట్‌లో ఉత్తమ ప్రతిభను గౌరవించే చేతక్ స్క్రీన్ అవార్డ్స్ నామినేషన్లను ప్రకటించింది. అవార్డు వేడుక ఏప్రిల్ 5న గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు.
ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’ అత్యధికంగా 24 నామినేషన్లతో ముందంజలో నిలిచింది. మోహిత్ సూరి దర్శకత్వంలోని ‘సయ్యారా’ 17 నామినేషన్లు సాధించగా, నీరజ్ ఘయ్వాన్ రూపొందించిన ‘హోంబౌండ్’ 15 నామినేషన్లు దక్కించుకుంది. మొత్తం 31 విభాగాల్లో నామినేషన్లు ప్రకటించారు. 1995లో స్థాపించబడిన స్క్రీన్ అవార్డ్స్, 50 మందికి పైగా ప్రముఖ దర్శకులు, కళాకారులు మరియు సాంస్కృతిక ప్రముఖులతో కూడిన స్వతంత్ర, లాభాపేక్షలేని స్క్రీన్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి.
ఎంపిక ప్రక్రియ కఠినంగా, నిష్పాక్షికంగా నిర్వహించారు. 95% కంటే ఎక్కువ మంది అకాడమీ సభ్యులు పాల్గొని, ప్రతి విభాగాన్ని సగటున 38–40 మంది సభ్యులు ‘ట్రిమ్డ్ మీన్ (ఒలింపిక్)’ పద్ధతిలో స్క్రూటినీ చేశారు. పారదర్శకత కోసం యూనివర్సిటీ ఆఫ్ సదర్న్ కాలిఫోర్నియా స్కూల్ ఆఫ్ సినెమాటిక్ ఆర్ట్స్‌లో సినిమా , మీడియా స్టడీస్ చైర్ ప్రొఫెసర్ ప్రియా జైకుమార్ ప్రత్యేక స్కోరింగ్ విధానాన్ని రూపొందించారు. ఈ అవార్డులు భారతీయ వినోద రంగంలో సృజనాత్మక ప్రతిభను గౌరవించేందుకు మరియు సినీ, డిజిటల్ కంటెంట్‌లో ఉత్తమ నైపుణ్యాన్ని గుర్తించేందుకు ఏర్పాటు చేశారు.




