ధురంధర్ ఆల్ టైమ్ గ్లోబల్ రికార్డ్!
ప్రపంచవ్యాప్తంగా రూ.761 కోట్లపైగా వసూళ్లతో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ ఇండియన్ బ్లాక్‌బస్టర్‌గా సరికొత్త రికార్డును నెలకొల్పింది ‘ధురందర్: ది రివెంజ్’. అద్వితీయమైన ఓపెనింగ్ వీకెండ్‌ను అందించి, బాక్సా-ఫీస్ వద్ద ఆల్ టైమ్ గ్లోబల్ ఇండియన్ బ్లాక్‌బస్టర్‌గా ఇండియాతోపాటు విదేశాల్లో కొత్త బెంచ్‌మార్క్స్‌ను నమోదు చేసింది. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ స్పై థ్రిల్లర్ మూవీకి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు.
విడుదలైన నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం చారిత్రక వసూళ్లను సాధించి, హిందీ సినీ చరిత్రలో సరికొత్త మైలురాళ్లను నెలకొల్పింది. నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.750 కోట్ల (గ్రాస్) కలెక్షన్లతో దూసుకుపోతోంది. బుధవారం జరిగిన పెయిడ్ ప్రివ్యూల ద్వారానే రూ.43 కోట్లు సాధించిన ఈ సినిమా, ఆదివారం ఒక్కరోజే దేశీయంగా అత్యధికంగా రూ.115 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది.
హిందీ చిత్రసీమలో షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ నెలకొల్పిన రూ.287 కోట్ల ఓపెనింగ్ వీకెండ్ రికార్డును ‘ధురంధర్ 2’ సులభసంగా అధిగమించింది. ఓవర్సీస్ మార్కెట్లో కూడా రూ.180 కోట్లు వసూళ్లతో ఈ చిత్రం ప్రభంజనం సృష్టిస్తోంది. భారతీయ సినీ చరిత్రలో అత్యధిక ఓపెనింగ్ వీకెండ్ సాధించిన రెండో చిత్రంగా ‘ధురంధర్ 2’ నిలిచింది. ఇది ‘బాహుబలి 2’ (రూ.591 కోట్లు), ఆర్‌ఆర్‌ఆర్ (రూ.470 కోట్లు), ‘కల్కి 2898 ఏడీ’ (రూ.500 కోట్లు) వంటి భారీ పాన్ ఇండియా చిత్రాల రికార్డులను సైతం బ్రేక్ చేసింది. ప్రస్తుతం ‘పుష్ప 2’ (రూ.762 కోట్లు) మాత్రమే దీనికంటే ముందుంది.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, ఈ చిత్రం త్వరలోనే రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరడమే కాకుండా, లాంగ్ రన్ రూ.2000 కోట్ల మార్కును కూడా అందుకునే అవకాశం ఉంది. విదేశాల్లో అత్యధికంగా 2200 సినిమా హాళ్లు, 3000 స్క్రీన్లలో విడుదలైన తొలి హిందీ చిత్రమిదే. డిమాండ్ కారణంగా ఉరుగ్వే, ఉక్రెయిన్, బల్గేరియా, రొమేనియా, చిలీ, మెక్సికోెేసైప్రస్ వంటి నాన్ ట్రెడిషినల్ మార్కెట్లలోనూ విడుదల కావటం విశేషం.




