10 March, 2026 | 5:43 PM

పల్లె రోడ్లకు మహర్దశ

10-03-2026 11:45 AM

సీసీ రోడ్డు నిర్మాణనికి మండలనికి 2కోట్ల రూపాయలు మంజూరు

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్

చేగుంట: గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రజ పాలన ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని, గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్న గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి, దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సి హెచ్ శ్రీనివాస్ రెడ్డి చొరవతో గ్రామాల అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసి, మండలం లోని గ్రామాలలో అభివృద్ధి పనులు చేపడుతున్నారు.

ప్రజలకు మౌలిక వసతులు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళల కృషి చేస్తుందని చేగుంట లో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ అన్నారు . ప్రభుత్వం ఏటా జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో భాగంగా గ్రామాలకు సీసీ రోడను మంజూరు చేస్తున్నది. ఈ ఏడాది కూడా చేగుంట మండలం లో 2కోట్ల రూపాయల సీసీ రోడ్లు, నిర్మించడానికి ప్రభుత్వం రూ.2. కోట్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని తెలియచేసారు,