ఉద్యోగావకాశాల కల్పనకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి
రాష్ట్రం, జిల్లా నుండి 105 కంపెనీలు స్టాల్ లు ఏర్పాటు 3500 ఉద్యోగ అవకాశాలు
శిల్పారామంలో మెగా జాబ్ మేళాను ప్రారంభించిన రాష్ట్ర పశు సంవర్ధక, పాడి అభివృద్ధి, మత్స్య, క్రీడలు, యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి
మహబూబ్ నగర్, మే 1 (విజయక్రాంతి): విద్యారంగంను బలోపేతం చేస్తూ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అహర్నిశలు చిత్తశుద్ధితో కృషి చేస్తుం దనిరాష్ట్ర పశు సంవర్ధక,పాడి అభివృద్ధి, మత్స్య,క్రీడలు,యువజన శాఖా మంత్రి వాకిటి శ్రీ హరి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో శిల్పారామంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను ముఖ్య అతిథిగా పాల్గొని మంత్రి వాకిట శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా ప్రభు త్వం యువత సంక్షేమం వారి భవిష్యత్తు కో సం వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.
గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో మెరుగైన సౌకర్యాల కోసం మెస్, కాస్మెటిక్ ఛార్జీలను పెంచి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు వివరించారు.గత పదేళ్లుగా నిలిచిపోయిన ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులను పునఃప్రారంభించి సుమారు 25 వేల మందికి ప్రయోజనం కల్పించామని, పాఠశాలల్లో ఉ పాధ్యాయుల కొరతను అధిగ మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. యువతకు ప్రభుత్వ ఉద్యోగాలకే పరిమితం కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా విస్తృత అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
ఇప్పటికే రాష్ట్రంలో 1.30 కో ట్ల మంది యువత ఉద్యోగాల కోసం నమో దు చేసుకున్నారని, వారికి అవకాశాలు క ల్పించేందుకు 2,200 ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఉమ్మడి మహబూబ్నగ ర్ జిల్లాలో మెగా జా బ్ మేళా లో 105 కంపెనీలు పాల్గొంటున్నా యి, ప్రత్యక్ష ఇంటర్వ్యూల ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు అందిస్తున్నాయని తెలిపారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి 24,680 మంది అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఈ జాబ్ మేళాలలో నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు.
భవిష్యత్తుకు నైపుణ్యాలే కీలకం: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
డిగ్రీ సర్టిఫికెట్లు మాత్రమే కాకుండా ప్రొ ఫెషనల్ స్కిల్స్ కూడా అవసరమని యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. టెక్నాలజీ పరిజ్ఞానం, ప్రాక్టికల్ అనుభవం ఉద్యోగ సాధన లో కీలకమని తెలిపారు. మహిళల కోసం ప్రత్యేక నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు చేపట్టామని, కంప్యూటర్, కోడింగ్, ఫ్యాషన్ డిజైన్, బ్యూటీషియన్ కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ ద్వారా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు.
యువతకు భారీ అవకాశాలు: ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పది థీమ్ లను నిర్ణయించి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి తెలిపారు. యూత్ సర్వీసెస్ థీమ్ కింద ఈ జాబ్ మేళా నిర్వహించడం గొప్ప నిర్ణయమన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 70 వేల ఉద్యోగాలు కల్పించామని, ఈ మేళాలో సుమారు 100 కంపెనీలు పాల్గొని 3,500 ఉద్యోగాలు అందుబాటులో ఉంచాయని తెలిపారు.
ఎంపికైన అభ్యర్థులకు జిల్లాలలో మే 23న నియామక పత్రాలు అందజేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఇంటర్వ్యూల్లో ఎంపికైన అభ్యర్థులకు మంత్రి వాకిటి శ్రీహరి నియామక పత్రాలు అందజేశారు. దేవరకద్రకు చెందిన గాయత్రికి రూ.2.1 లక్షల ప్యాకేజీతో, జడ్చర్లకు చెందిన చంద్రకాంత్కు రూ.2.5 లక్షల ప్యాకేజీతో, నారాయణపేటకు చెందిన విష్ణుమూర్తికి ఉద్యోగ నియామక పత్రాలు అందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా, యంఎల్సి,శాసన మండలి చీఫ్ విప్, పట్నం మహేందర్ రెడ్డి, స్పోరట్స్ అథారిటీ తెలంగాణ చైర్మన్ శివ సేనా రెడ్డి, ఏ. సోని బాల దేవి,టాస్క్ సి ఈ. ఓ నితిన్ కుమార్ రెడ్డి,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్,రెవెన్యూ అదనపు కలెక్టర్ జె .ఎల్ .బి హరిప్రియ, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబెదుల్ల కోత్వాల్, నగర డిప్యూటీ మేయర్ మారే పల్లి సురేందర్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి,పరిశ్రమల శాఖ జి ఎం.యాదయ్య,జిల్లా క్రీడలు యువజన అధికారి రాజశేఖర్ రెడ్డి,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.






