12 July, 2026 | 3:49 PM

Breaking News

విశాఖలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు   •   సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు లేఖ   •   ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •  

విద్యుత్ వినియోగంపై అవగాహన కలిగి ఉండాలి

02-05-2026 12:13 AM

చారకొండ, మే 1: విద్యుత్తు వినియోగంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, అజాగ్రత్తగా ఉంటే ప్రమాదాలు సంభవిస్తాయని విద్యుత్ శాఖ ఏఈ జానకిరాం సూచించారు. శుక్రవారం చారకొండ మండల కేంద్రంలో విద్యుత్తు భద్రతా వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ సిబ్బంది, స్థానిక నాయకులు కలిసి అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు.

విద్యుత్ లైన్ల కింద నివాసాలు ఉండకూడదని, వైర్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఏఈ జానకి రామ్ సూచించారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ జేఎల్‌ఏం శ్రీశైలం, ఉప సర్పంచి కీసరి మల్లేష్, డీసీసీ ప్రధాన కార్యదర్శి జమ్మికింది బలరాం గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి జేసిబి వెంకటయ్య నాయకులు గోరేటి శివ, చండీశ్వర్ గౌడ్, కిరణ్, వెంకటయ్య, సత్యం, విద్యుత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.