10 March, 2026 | 2:38 PM

అమృత్ 2.0 పథకం నిర్మాణ పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్

10-03-2026 11:47 AM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటిలో జిల్లా అదనపు కలెక్టర్(Additional Collector) చంద్రయ్య మంగళవారం పర్యటించారు. కన్నాల శివారులో అమృత్ 2.O పథకం ద్వారా చేపట్టిన నీటి ట్యాంకు, ఇతర నిర్మాణ పనులను మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య తో కలిసి బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి-రమేష్ బాబు పరిశీలించారు.

ఈ సందర్బంగా అమృత్ 2.O పథకంలో భాగంగా చేపట్టిన నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ చంద్రయ్య అధికారులను ఆదేశించారు. అదేవిదంగా వేసవి దృష్ట్యా త్రాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అడా ప్రాజెక్ట్ నుంచి మిషన్ భగీరథ ద్వారా మంచి నీరు సరఫరా అయ్యేలా చూడాలనిన్నారు.ఆయన వెంట బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి, అధికారులు ఉన్నారు.