కోఆప్షన్ కు నామినేషన్ దాఖలు చేసిన నలుగురు కాంగ్రెస్ అభ్యర్థులు
01-05-2026 10:59 PM
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపాలిటీ కో ఆప్షన్ పదవికి దరఖాస్తు చివరి రోజు శుక్రవారం కావడంతో కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థులు కాసుల రోహిత్, మొహమ్మద్ మజీద్, (ముజ్జు), కొర్ల ప్రతిమ నరేష్ రెడ్డి, కమర్ సుల్తానా గౌస్ లు దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ అభ్యర్థులు కౌన్సిలర్ లు ఉండడంతో కో ఆప్షన్ పదవులు లాంచనంగానే కాంగ్రెస్ పార్టీకి దక్కుతున్నట్లు తెలుస్తుంది. దీంతో కాంగ్రెస్ బలం 16 కు చేరుతుంది.






