మండాలపాడులో నీటి కష్టాలకు చెక్
కొత్త బోర్ మోటార్‌ను ప్రారంభించిన సర్పంచ్ గాయం రమేష్
పెనుబల్లి.(విజయక్రాంతి): పెనుబల్లి మండలం మండాలపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని పలు వార్డుల్లో నెలకొన్న మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు సర్పంచ్ గాయం రమేష్ ప్రత్యేక చొరవ చూపారు. మంగళవారం సాయంత్రం గ్రామంలోని 6, 7 మరియు 10వ వార్డుల ప్రజల సౌకర్యార్థం నూతనంగా ఏర్పాటు చేసిన బోర్ మోటార్‌ను ఆయన స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు.
గత కొంతకాలంగా ఈ వార్డుల్లో నీటి సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని గుర్తించిన సర్పంచ్, యుద్ధప్రతిపాదికన కొత్త మోటార్ ఏర్పాటు చేయడమే కాకుండా, 6వ వార్డులో పాడైపోయిన పాత బోర్ మోటార్‌ను కూడా దగ్గరుండి మరమ్మతులు చేయించారు. దీనితో ప్రస్తుతం ఆయా వార్డుల్లో నీటి సరఫరా పునరుద్ధరించబడింది.
ఈ సందర్భంగా సర్పంచ్ గాయం రమేష్ మాట్లాడుతూ, గ్రామ ప్రజలకు కనీస అవసరాలైన తాగునీరు, పారిశుధ్యం విషయంలో ఎటువంటి లోటు రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. నీటి కష్టాలను తీర్చినందుకు 6, 7, 10వ వార్డుల ప్రజలు సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా దిశ కమిటీ సభ్యులు కిషోర్ పోతురాజు, పంచాయతీ సెక్రటరీ T. నాగేంద్ర బాబు, 6,7 మరియు 10వ వార్డు మెంబర్స్, సభ్యులు, గ్రామ పెద్దలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.




