8 April, 2026 | 8:39 PM

పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్

08-04-2026 06:46 PM

8500 కోట్ల  బకాయిలను వెంటనే చెల్లించాలి: డా" చింతపల్లి శ్రీనివాస్ గౌడ్

దేవరకొండ,(విజయక్రాంతి): పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్,స్కాలర్షిప్స్ 8500 కోట్ల  బకాయిలను వెంటనే చెల్లించాలి,ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలని ఆలోచనను విరమించుకోవాలి, దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డికి  వినతి పత్రం అందజేశారు మాట్లాడుతూ.గత నాలుగు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు 8500 కోట్లు తక్షణమే విడుదల చేసి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థులకు మేలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. హైకోర్టు విద్యార్థుల నుంచే ఫీజులను వసూలు  తీర్పు పేద విద్యార్థులకు విద్యకు దూరం చేసే విధంగా ఉందన్నారు విద్యార్థులకు న్యాయం జరిగేవిధంగా చూడాలి డిమాండ్ చేశారు.