22 April, 2026 | 3:04 PM

Breaking News

ప్రైవేట్ హాస్పిటల్‌లో వైద్యుల నిర్వాకం.!   •   కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒకటే... హైకోర్టు తీర్పుపై కిషన్ రెడ్డి స్పందన   •   చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం.. సంతాపం తెలిపిన కేంద్రమంత్రి   •   కాళేశ్వరంపై కేంద్రం సీబీఐ విచారణ చేయించాలి.. కాంగ్రెస్ ఎంపీ చామల డిమాండ్   •   ఆర్టీసీ సమ్మెకు బిజెపి మద్దతు..   •   గ్రామంలో గుప్త నిధుల కలకలం   •   షాద్‌నగర్ చౌరస్తాలో మల్లికార్జున ఖర్గే దిష్టిబొమ్మ దగ్ధం   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •  

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి

08-04-2026 07:57 PM

గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ వంగవేటి రామారావు

కోదాడ: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ వంగవేటి రామారావు అన్నారు. కోదాడ పీఏసీఎస్ పరిధిలో తమ్మరబండపాలెంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ప్రారంభించి మాట్లాడారు. రైతులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వం కల్పించే మద్దతు ధర, బోనస్, ఇతర ప్రభుత్వ పథకాలను రైతులు ఉపయోగించుకోవాలన్నారు.

రైతులకు మేలు చేసేందుకు తమ ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తుందన్నారు. కోదాడ పీఏసీఎస్ ఇన్‌చార్జి కామినేని పద్మజ మాట్లాడుతూ రైతుల కోసం బాలాజీనగర్, కొమరబండ, తొగర్రాయి, కూచిపూడిల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. ఆర్డీఓ సూర్యనారాయణ, , తహశీల్దార్ వాజిద్ అలీ, కౌన్సిలర్ సామినేని రజిని నరేష్, గోపి, సుల్తాని సుజాత రాంబాబు, బత్తినేని హనుమంతరావు, సీఈఓ వెంకటేశ్వర్లు, కమతం వెంకటయ్య, రైతులు పాల్గొన్నారు.