22 April, 2026 | 3:05 PM

Breaking News

ప్రైవేట్ హాస్పిటల్‌లో వైద్యుల నిర్వాకం.!   •   కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒకటే... హైకోర్టు తీర్పుపై కిషన్ రెడ్డి స్పందన   •   చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం.. సంతాపం తెలిపిన కేంద్రమంత్రి   •   కాళేశ్వరంపై కేంద్రం సీబీఐ విచారణ చేయించాలి.. కాంగ్రెస్ ఎంపీ చామల డిమాండ్   •   ఆర్టీసీ సమ్మెకు బిజెపి మద్దతు..   •   గ్రామంలో గుప్త నిధుల కలకలం   •   షాద్‌నగర్ చౌరస్తాలో మల్లికార్జున ఖర్గే దిష్టిబొమ్మ దగ్ధం   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •  

ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో ఘనంగా ఫేర్‌వెల్ డే వేడుకలు

08-04-2026 08:04 PM

సుల్తానాబాద్,(విజయకాంతి): సుల్తానాబాద్ పట్టణంలోని ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో బుధవారం ఫేర్‌వెల్ డే వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు పలుకుతూ నిర్వహించిన ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రత్యేకంగా నృత్య ప్రదర్శనలు, పాటలు, వినోదాత్మక కార్యక్రమాలు హాజరైన వారిని అలరించాయి.విద్యార్థులు తమ పాఠశాల జీవితంలోని అనుభవాలను పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్ మాట్లాడుతూ... విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు.పాఠశాల అందించిన విలువలను ఎప్పటికీ గుర్తుంచుకోవాలని అన్నారు.ప్రిన్సిపల్ కృష్ణప్రియ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు బంగారంలా మెరవాలని ఆకాంక్షిస్తూ,ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాలను సాధించే దిశగా కృషి చేయాలని సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థులతో గడిపిన అనుభవాలను గుర్తుచేసుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు తమ గురువులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు,విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.