22 April, 2026 | 1:28 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కు బీసీ సంఘాల సంఘీభావం

08-04-2026 08:02 PM

ముకరంపుర,(విజయక్రాంతి): శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఉమేష్ కుమార్ కు మద్దతుగా బుధవారం అన్ని బిసి సంఘల నేతలు శాతవాహన యూనివర్సిటీ గేటు ముందు సంఘీభావం తెలిపారు. యూనివర్సిటీ పనితీరుకు మెరుగైన చర్యలు  చేపడుతున్న విసిని కొంతమంది కావాలని అడ్డు తగులుతున్నరని  విమర్శించారు. ప్రభుత్వ జీతా భత్యం పొందుతూ పనిచేయ కుండా కొంతమంది రాజకీయాలు చేస్తూ యూనివర్సిటీ పరువు తీస్తున్నారని  విమర్శించారు. బిసి వర్గాలు  వున్నత పదవులలో  వుంటే తట్టుకోలేక అక్కసు వెళ్లగక్కు తూన్నా రని ఆరోపించారు.  విద్యార్థుల ప్రగతి కోసం పనిచేస్తున్న  విసీని పనిగట్టుకొని వెనక్కే లాగే కుట్రలు మానుకోవాలని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేశిపెద్ది శ్రీధర్ రాజు, బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఆది మల్లేశం, బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్, బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి బొల్లం లింగమూర్తి , బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్, వర్కింగ్ ప్రెసిడెంట్ రాచమల్ల రాజు, బీసీ యువజన సంఘం అధ్యక్షులు నర్సింగొజు శ్రీనివాస్, మాదాసు సంజీవ్, పట్టణ అధ్యక్షులు హనుమాన్ల నితిన్, బీసీ కొత్తపల్లి మండల ప్రధాన కార్యదర్శి కుంట చంద్రయ్య, గరిగ కోటేశ్వర్, లింగంపల్లి శ్రీనివాస్, వంగల రవి గోపాల్, పొన్నాల తిరుపతి, కల్వ మధుబాబు, కే సతీష్, తదితరులు పాల్గొన్నారు.