ఎస్ఆర్ఎన్కె ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా రక్తదాన శిబిరం
కళాశాల ప్రిన్సిపాల్ ఐ.గంగాధర్ చేతుల మీదుగా ప్రారంభం
బాన్సువాడ,(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం ఎస్ ఆర్ ఎన్ కె డిగ్రీ,పీజీ కళాశాలలో మహనీయుల జయంతి సందర్భంగా మేరా యువభారత్, ఎన్ సి సి, ఎన్ఎస్ఎస్ వారి ఆధ్వర్యంలో బాన్సువాడ ఏరియా ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో బుధవారం మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఐ గంగాధర్ చేతుల మీదుగా మహనీయులైనటువంటి బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిబాపూలే చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ గంగాధర్ మాట్లాడుతూ... ఈ దేశం కోసం చేసిన సేవలను గుర్తు చేసుకొని వారి ఆశయాలను కొనసాగించాలని దృఢ సంకల్పంతో ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. నేటి తరం యువత సామాజిక సేవ వైపుకు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు . రక్తదానం చేయడం అంటే ప్రాణం నీ దానం చేయడమే అనంతరం వయసుతో సంబంధం లేకుండా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఐ గంగాధర్ రక్తాన్ని దానం చేశారు. ఈ రక్తదాన శిబిరంలో 35 మంది యువకులు, అధ్యాపకులు ఉత్సాహంగా రక్తదానం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ సునీల్ రాథోడ్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నో ఉన్నతమైన విద్యను అభ్యసించి ప్రపంచంలో అత్యంత లిఖితపూర్వకమైన రాజ్యాంగము రచించిన ఎందరో అభాగ్యుల జీవితాలను మార్చారు. ఎస్ ఆర్ ఎన్ కె విద్యార్థులు కూడా ఆయనను ఆదర్శంగా తీసుకొని ఈ రక్తదాన శిబిరంలో ఉత్సాహంగా పాల్గొన్నారు ఎందరో రోగుల ప్రాణాలను కాపాడిన వాళ్ళు అవుతారని తాను దాదాపుగా 25సార్లు రక్తదానం చేశానని అన్నారు .ఈ కార్యక్రమంలో బాన్సువాడ బ్లడ్ బ్యాంక్ ప్రతినిధి రఘు, ఆనంద్ ,శ్రీకాంత్, కళాశాల ఎన్ సి సి కృష్ణ ,ముస్తఫా, విటల్ రఫీ, వినయ్ కుమార్ , ఎన్ ఎస్ ఎస్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.




