5 March, 2026 | 8:07 AM

ఓటర్ జాబితాలో మార్పులు, చేర్పులు

05-03-2026 02:39 AM

రామాయంపేట, మార్చి 4 :డూప్లికేట్ పేర్లు, మారిన వివరాలు, కొత్తగా చేరిన కోడళ్ల వివరాలు ఆల్ క్లియర్ చేసి నిష్కళంకమైన ఓటర్ లిస్టు తయారు చేయడమే లక్ష్యమని తహసీల్దార్ రజనీకుమారి స్పష్టం చేశారు. రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో ఎస్‌ఐఆర్ ప్యూరిఫికేషన్ డ్రైవ్ క్ర మంగా కొనసాగుతోంది. ప్రాథమిక పరిశీలనలో కొన్ని డూ ప్లికేట్ నమోదులు, 40 ఏళ్లు పైబడిన సింగిల్ ఉమెన్ ఓటర్ల వివరాల్లో అసంగతతలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

ఈ నేపథ్యంలో ప్రతి ఇంటి స్థాయిలో ధృవీకరణ చేపడుతున్నారు.ఇటీవల వివాహం అ య్యి రామయంపేటకు వచ్చిన కోడళ్ల వివరాలు అప్డేట్ చేయాలంటే వారి తండ్రుల ఏపీ కార్డు లేదా సంబంధిత పత్రాలను బీఎల్వోకు అందజేయాలని అధికారులు సూచించారు.

సరైన పత్రాలు అందితే వెంటనే ప్రాసెస్ చేసి కొత్తగా నమోదు చేస్తామని చెప్పారు. ఒకే వ్యక్తి పేరు రెండు చోట్ల ఉండకూడదనే ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఓటు హక్కు విలువను కాపాడటానికి ప్రతి కుటుంబం సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్న బీఎల్వోలకి ప్రజలు సహకరిస్తే తక్కువ సమయంలోనే స్వచ్ఛమైన ఓటరు జాబితా సిద్ధమవుతుందని స్పష్టం చేశారు.