5 March, 2026 | 9:38 AM

సమాజ మార్పులో భాగస్వాములు కావాలి

05-03-2026 02:38 AM

యువతకు సీపీ పిలుపు

సిద్దిపేట క్రైం, మార్చి 4 : సృజనాత్మకతతో సమాజ మార్పులో భాగస్వాములు కావాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ యువతకు పిలుపునిచ్చారు. పోలీస్ కమిషనరేట్ ఆ ధ్వర్యంలో సోషల్ మీడియా వేదికగా నిర్వహించిన మొదటి విడత ఆన్లైన్ షార్ట్ వీడియోల పోటీలలో ప్రతిభ కనబరిచిన విజేతలకు సీపీ బహుమతులు అందజేసిన విషయం తెలిసిందే. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు పాల్గొన్న వారందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ వినూత్న కార్యక్రమానికి ఆకర్షితులైన ప్రముఖ వినోద సంస్థ ’వండర్లా’... విజేతలకు ఉచిత ప్రవేశ కూపన్లను స్పాన్సర్ చేసింది.

సీపీ ఈ కూపన్లను విజేతలకు పంపిణీ చేశారు. మొదటి విడతకు వచ్చిన అనూహ్య స్పందనతో షార్ట్ వీడియో కాంటెస్ట్ 2.0 ను ప్రారంభించారు. సమాజంలో చైతన్యం నింపేందుకు యువత, కంటెంట్ క్రియేటర్లు, ఇన్ఫు్లయెన్సర్లు ఈ పోటీలో పాల్గొనాలని సీపీ పిలుపునిచ్చారు.

సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన, మహిళల భద్రత, వేధింపులు, ఈవ్ టీజింగ్ నిరోధం, మాదక ద్రవ్యాల నిర్మూలనపై షార్ట్ వీడియోలను రూపొందించాలని సూచించారు. సామాజిక బాధ్యతతో కూడిన వీడియోలను సోషల్ మీడియాలో తమ అధికారిక ఖాతాలకు ట్యాగ్ చేయాలని సూచించారు. ప్రతిభావంతులకు ఆకర్షణీయమైన బహుమతులు అందజేస్తామని తెలిపారు.