చాంపియన్ త్రిష్ణ సెయిలింగ్ క్లబ్
హైదరాబాద్, జూలై 24 : జీఎంఆర్ స్పోర్ట్స్ 6వ సికిం ద్రాబాద్ క్లబ్ యూత్ ఓపెన్ రెగట్టాలో త్రిష్ణ సెయిలింగ్ క్లబ్ ఆప్టిమిస్ట్ క్లాస్ టీమ్ ఛాంపియన్స్‌గా నిలిచింది. హోరాహో రీగా సాగిన పోటీల్లో కృష్ణ(ఆర్‌ఎంవైసి), అల్డ్రెయిన్ ఆంటోనీ, విరాట్, కైరుల్ అఫెండి(మలేషియా) అద్భుత ప్రదర్శన కన బరిచి అగ్రస్థానం సాధించారు.
తెలంగాణ సెయిలింగ్ అసోసియేషన్ టీం రమీజా బాను, మణి,రవి బెన్నె ల్లు, నరసింహ రెండో స్థానంలోనూ, సీఈఎస్‌సీ,టీఎస్‌సికి చెందిన యువరాజ్ సిరోహి, ఆయుశ్ నికమ్, ఆదిత్య, ప్రిన్స్ బరార్ మూ డో స్థానంలోనూ, తెలంగాణ సెయిలింగ్ అసోసియేషన్‌కు చెందిన టీం విశాల్, అక్షయ్ కుమార్, కొండా సామాన్యు, హనుమంతు నాలుగో స్థానంలోనూ నిలిచింది. టీమ్ ఈవెంట్‌లో 8 జట్లు పోటీపడగా 36 రేసులు జరిగాయి. యువ సెయిలర్లకు ఈ పోటీలు మంచి అవకాశమని సికింద్రాబాద్ క్లబ్ కమాడోర్ అర్జున్ చెప్పారు.






