భారత్‌కు తొలి పతకం
- లవ్లీనాకు బై, సెమీస్‌కు క్వాలిఫై
- కనీసం కాంస్యం ఖాయం
గ్లాస్గో, జూలై 24 : గ్లాస్గో వేదికగా ప్రారంభమైన కామన్‌వెల్త్ గేమ్స్‌లో తొలిరోజే భారత్‌కు పతకం ఖాయమైంది. బాక్సింగ్ మహిళల 75 కేజీల విభాగంలో లవ్లీనా బొర్గో హెయిన్ నేరుగా సెమీ ఫైనల్‌కు అర్హత సాధించింది. క్వార్టర్ ఫైనల్స్‌లో ఐదుగురు బాక్సర్లు మాత్రమే అందుబాటులో ఉండటంతో డ్రాలో లవ్లీనాకు బై లభించింది. దీంతో లవ్లీనా భారత్‌కు కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసింది. ఆమెతో పాటు మరో ఇద్దరు నేరుగా సెమీస్కు అర్హత సాధించారు.
జులై 31న జరిగే సెమీ ఫైనల్లో తువాలుకు చెందిన టీకేబీపీ తాఫాకీతో లవ్లీనా తలపడనుంది. దీనిలో గెలిచిన వారు స్వర్ణ పతక పోరుకు అర్హత సాధిస్తారు. లవ్లీనాకు కామన్‌వెల్త్ గేమ్స్‌లో ఇదే తొలి మెడల్ అస్సాంకు చెందిన లవ్లీనా టోక్యో ఒలింపిక్స్ (2020)లో కాంస్య పతకం (69 కేజీల విభాగం), 2023 ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం , 2022 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం, 2023 ఆసియా క్రీడల్లో రజతంతో మెరిసింది.
లాన్‌బౌల్స్‌లో శుభారంభం
ఇదిలా ఉంటే తొలిరోజు పోటీల్లో లాన్ బౌల్స్‌లో భారత్ సంచలన ప్రదర్శనతో అదరగొట్టింది. మహిళల పెయిర్స్ విభాగంలో రూపారాణి, పింకి సింగ్ తొలి రౌండ్‌లో విజయం సాధించింది. అలాగే పురుషుల సింగిల్స్‌లో పుతుల్ సోనోవాల్ కూడా శుభారంభం చేశాడు.






