24 July, 2026 | 2:41 AM

కామన్‌వెల్త్ గేమ్స్ జిమ్నాస్టిక్స్‌కు ఏఎంఎన్‌ఎస్ ఇండియా అథ్లెట్లు

24-07-2026 01:38 AM

బెంగళూరు, జూలై 24 : స్కాట్లాండ్ గ్లాస్గో వేదికగా మొదలైన కామన్‌వెల్త్‌గేమ్స్ లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించేందుకు ఒడిశా ఎఎంఎన్‌ఎస్ ఇండియా జిమ్నాస్టిక్స్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్‌కు చెందిన ముగ్గురు అథ్లెట్లు ఎంపికయ్యారు. ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ విభాగంలోని ఎనిమిది మంది క్రీడాకారులలో తపన్ మొహంతి, తాపేశ్వరనాథ్ దాస్, ఒలింపియన్ ప్రణతి నాయక్ ఒడిశా ఎఎంఎన్‌ఎస్ ఇండియాలో శిక్షణ పొందినవారే.

తపన్ మొహంతి, తాపేశ్వరనాథ్ దాస్ పురుషుల ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ విభాగంలో భారత పురుషుల జట్టులో సభ్యులుగా ఉన్నారు. ఒలింపియన్ ప్రణతి నాయక్, మహిళల ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ విభాగంలో భారత మహి ళల జట్టులో కీలక అథ్లెట్‌గా వ్యవహరిస్తోం ది. వీరంతా అంతర్జాతీయ కాంటినెంటల్ కప్ 2026, లిస్బన్, ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ఆసి యా ఛాంపియన్‌షిప్ 2025, ఎఫ్‌ఐజీ వర ల్డ్ కప్ 2025, ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ నేషనల్ ఛాంపియన్‌షిప్ 2025, 2026 వంటి వివిధ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వేదికలలో అద్భు త విజయాలను సాధించారు.

ఒడిశా ఎఎంఎన్‌ఎస్ ఇండియా జిమ్నాస్టిక్స్ హై పెర్ఫార్మె న్స్ సెంటర్ అత్యుత్తమ శిక్షణ ద్వారా వీ రంతా మరింత రాటుదేలి కామన్‌వెల్త్‌గేమ్స్ కు అర్హత సాధించారు. ఈ ముగ్గురు అ థ్లెట్లు కామన్‌వెల్త్‌గేమ్స్‌లో పోటీపడుతుండ డం తమకు ఎంతో గర్వకారణమని ఒడిశా ఎఎంఎన్‌ఎస్ ఇండి యా ఇండియా డైరెక్టర్, వైస్ ప్రెసిడెంట్  అశుతోష్ తెలాంగ్ వ్యాఖ్యానించారు.