6 July, 2026 | 4:20 PM

Breaking News

అనుమతి లేని తరగతులను సీజ్ చేసిన ఎంఈఓ రాజయ్య   •   ఎకో టూరిజం అభివృద్ధి చేయాలి: సీఎం రేవంత్​ రెడ్డి   •   ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి   •   8వ రోజుకు చేరిన సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు   •   సుల్తానాబాద్ లో జగ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులు   •   ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం   •   విద్యార్థులను పరామర్శించిన ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు   •   ధర్మారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ బాలాజీ   •   108, 102 వాహన సేవలను సద్వినియోగపరచుకోండి: వైద్యాధికారి రమేష్   •   ప్రభుత్వ హాస్టల్ సమస్యలపై ప్రజావాణిలో ఆర్డీఓకి వినతి   •  

జెక్ కాలనీలో చలివేంద్రం ప్రారంభం

11-04-2026 05:03 PM

సనత్‌నగర్,(విజయక్రాంతి): వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకుని జెక్ కాలనీలోని SVSS నివాస్ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శనివారం సొసైటీ అధ్యక్షుడు కె.సురేష్ చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సామాజిక బాధ్యతగా ప్రతి సంవత్సరం వేసవికాలంలో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.

రాబోయే మూడు నెలల పాటు నిరంతరాయంగా ఈ కేంద్రం ద్వారా బాటసారులకు, స్థానికులకు చల్లని తాగునీరు మరియు మజ్జిగ పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు ఈ సదుపాయాన్నివినియోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఎస్. వై. సంపత్ కుమార్, ఖజాంచి వి. తిరుపతి రెడ్డి, సభ్యులు కె. రాజేంద్ర, కె.శ్రీను, సరాఫ్ సంతోష్ కుమార్ పాల్గొన్నారు. సిబ్బందిలో సూపర్వైజర్ గణేష్, సురేందర్ తదితరులు హాజరయ్యారు.