25 February, 2026 | 6:14 AM

కలిసి నడుద్దాం.. ప్రగతిని సాధిద్దాం

25-02-2026 01:23 AM

బుల్లెట్ స్పీడ్‌లో అభివృద్ధి చేద్దాం

మున్సిపల్ సమావేశంలో చైర్మన్ యూనస్

జహీరాబాద్, ఫిబ్రవరి 24: జహీరాబాద్ మునిసిపాలిటీ అభివృద్ధికి పార్టీలకతీతంగా అందరం కలిసి సహాయ సహకారాలతో పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందామని మున్సిపల్ చైర్ పర్సన్ యూనస్ అన్నారు. మంగళవారం నాడు జహీరాబాద్ మున్సిపాలిటీ మొదటి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ పాల్గొన్నారు. పట్టణంలోని అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కౌన్సిలర్లు విజ్ఞప్తి చేశారు.

ప్రతి వార్డులో త్రాగునీరు మురుకు కాలువలు విధి దీపాల సమస్య ఉందని వాటిని వెంటనే పరిష్కరించాలని పలువురు కౌన్సిలర్లు చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. దీనికి స్పందించిన చైర్మన్ యూనస్ మాట్లాడుతూ కౌన్సిలర్ అందరూ సహాయ సహకారాలు అందిస్తే అందరం కలిసి పట్టణ అభివృద్ధి కొరకు పని చేద్దామని ఆయన వివరించారు. కొన్ని వార్డులలో ఇప్పటివరకు మురుగు కాలువ లేవని ఇండ్ల నుంచి వచ్చే మురుగునీరు అంతా రోడ్డుపైనే ప్రవహిస్తుందని దీంతో దుర్గంధంతో పాటు దోమలు ఈగలు ఎక్కువై ప్రజలు అనారోగ్యం నా బారిన పడుతున్నారని బాగా రెడ్డికి పల్లి ఇచ్చిందని కౌన్సిలర్ వివరించారు.

పట్టణ అభివృద్ధి కోసం మూడు ప్రతిపాదనలు సభ ఆమోదించింది దీనిలో త్రాగునీరుతో పాటు వి ద్యుత్ దీపాలు డంపింగ్ యార్డ్ కొరకు పది లక్షల చొప్పున సభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ఎంపీ సురేష్ కుమార్ సెట్ కార్ మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి కోసం కౌన్సిల్ ఏర్పడక ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 18 కోట్ల రూపాయలు ఇచ్చారని దానితో వివిధ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.

ఇంకా కావాల్సిన నిధులను సమకూర్చుకునేందుకు 15 కోట్ల రూపాయల ప్రతిపాదనను సిద్ధం చేశామని వాటిని త్వరలోనే చచ్చేందుకు తాను ప్రయత్నిస్తానని ఎంపీ తెలిపారు. జహీరాబాద్ ప ట్టణంలో సుభాష్ గంజ్ ప్రాంతంలో నిర్మించిన మార్కెట్ యార్డును పనులు పూర్తయ్యా యని దానిని వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని 27 వార్డు కౌన్సిలర్ స్రవంతి కోరారు. ఏది ఏమైనా పనికి రంజాన్ పండుగ సమీపిస్తుందనితో ముందుగా విధి దీపాలను ఏర్పాటు చేయాలని కౌన్సిలర్లు కోరగా అందుకు స్పందించిన చైర్మన్ త్వరలోనే 10 లక్షల రూపాయలతో విద్యుత్ దీపాలు అమర్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

దీనికి స్పందించిన మరో కౌన్సిలర్ విధిదీపాల ఏర్పాట్లు నాణ్యతవంతమైన మంచి విద్యుత్ దీపాలను అమర్చాలని చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లారు. మొదటగా సమావేశం ప్రారంభం కాగానే కౌన్సిలర్ సంజీవ్ తీర్మానాలపై చర్చ జరగాలని అనడంతో మరో కౌన్సిలర్ కల్పించుకొని అడ్డు కోవడంతో ఇద్దరి మధ్యన కొద్దిసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది దీనికి స్పందించిన చైర్మన్ కౌన్సిలర్ శాంతించాలని ప్రతి దానికి సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని కౌన్సిలర్ అందరూ సహకరిస్తేనే పార్టీలను పక్కనపెట్టి పట్టణాభివృద్ధి కొరకు సహ కరించమని ఆయన చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ తో పాటు జహీరాబాద్ తహసిల్దార్ దశరథ్ పాల్గొన్నారు.