04-02-2026 07:23:09 PM
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): వరంగల్ లోని శ్రీ భద్రకాళి దేవస్థానాన్ని బుధవారం ఉదయం హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి దంపతులు తమ వివాహ వార్షికోత్సవ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన వెంకట్రాంరెడ్డి దంపతులకు ఆలయ ధర్మకర్తలు, అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. ముందుగా ఆదిశంకరాచార్యులు, వల్లభ గణపతిని దర్శనం అనంతరం ఆలయ మహామండపంలో భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితులు మహాదాశిర్వచనం నిర్వహించి, అమ్మవారి శేష వస్త్రములు బహుకరించి, ప్రసాదములు అందజేశారు.