16 May, 2026 | 4:30 AM

పెరిక కార్పొరేషన్ చైర్మన్

16-05-2026 12:54 AM

దొంగరి వెంకటేశ్వర్లుకు ఘన సన్మానం

హుజూర్ నగర్, మే 15 : తెలంగాణ రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్మన్గా ఇటీవల నియామకమైన దొంగరి వెంకటేశ్వర్లును టీపీసీసీ రాష్ట్ర మాజీ జాయింట్ సెక్రటరీ ఎండి అజీజ్ పాషా ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా శుక్రవారం ఆయనను చాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలు, బొకేలు, పూలమాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో తన నియామకం జరిగిందని రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కార్పొరేషన్ అభివృద్ధికి కృషి చేసి ప్రజలకు మరింత సేవలు అందించాలని పలువురు నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు హుజూర్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.