2 April, 2026 | 2:11 AM

ఎన్పీడీసీఎల్ అధికారుల పర్యవేక్షణలో సెస్

02-04-2026 12:18 AM

రాజన్న సిరిసిల్ల,ఏప్రిల్1 (విజయ క్రాంతి): సిరిసిల్ల సెస్ ఏప్రిల్ ఒకటి నుండి ఎన్సీడీసీఎల్ పర్యవేక్షణలోకి పోనుంది.సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం గత యాభై ఏడు సంవత్సరాల నుండి నాణ్యమైన విద్యుత్తును అటు రైతులకు ఇటు నేత కార్మికుల దృష్ట్యా పవర్లూమ్ లకు విద్యుత్తును సరఫరా అందిస్తున్న విషయం తెలిసిందే .అలాంటి సంస్థ యొక్క లైసెన్స్ గడువు మార్చి 31 నాటికి ముగియడం రెన్యువల్ కాకపోవడంతో ఏప్రిల్ 1న ఎన్పీడీసీఎల్ సిఎండి వరుణ్ రెడ్డి ఆధ్వర్యంలో పర్యవేక్షించినట్లు తెలుస్తోంది.

ఈ మేరకు వరుణ్ రెడ్డి నేటి నుండి సెస్ పర్యవేక్షణలో ఉంటున్నట్లు బుధవారం స్పష్టం చేశారు.సెస్ లో జరుగుతున్న పరిణామాలతో అటు రైతుల్లోను ఇటు నేత కార్మికుల్లోను ఉత్కంఠ నెలకొంది. విద్యుత్ సేవలను అందిస్తున్న సెస్ లైసెన్స్ రెన్యువల్ నిలిపివేత చర్చనీయాంశంగా మారింది. దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్న సెస్ ప్రతిష్టాత్మకమైన పేరు గడిచింది.

లైసెన్స్ రెన్యువల్ కాకపోవడంతో ఎన్పీడీసీఎల్ పర్యవేక్షణలోకి వెళ్ళింది.ఏప్రిల్ ఒకటి నుండి అనూహ్యంగా సెస్ కు సంబంధించిన బాధ్యతల న్నింటిని ఎన్పీడీసీఎల్ పర్యవేక్షణలో కి తీసుకుంటున్న నేపథ్యంలో విద్యుత్ వినియోగదారులు ఎలాంటి ఆందోళనకు గురికా వద్దని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీసీఎల్ సిఎండి వరుణ్ రెడ్డి మాట్లాడుతూ సెస్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులు ఆందోళన చెందవద్దని, కరెంటు నిరంతరంగా అందిస్తామని, రానున్న వేసవికాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి అంతరాయం కలగకుండా విద్యుత్ సరఫరా చేస్తూ ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు.