15 June, 2026 | 2:45 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

గర్భాశయ క్యాన్సర్ నివారణ టీకా కార్యక్రమం ప్రారంభం

31-03-2026 12:47 AM

మరిపెడ, మార్చి 30 (విజయక్రాంతి): మహిళల్లో ప్రాణాంతకంగా మారుతున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను అరికట్టే లక్ష్యంతో చేపట్టిన క్యాన్సర్ వైరస్ నిరోధక టీకా కార్యక్రమాన్ని మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ గుగు లోతు రవి ప్రారంభించి, మండలంలోని 13 నుంచి 15 ఏళ్ల లోపు బాలికలందరూ ఈ ఉచిత టీకా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ప్రైవేట్ ఆసుప త్రుల్లో వేల రూపాయలు ఖర్చయ్యే ఈ టీకాను ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నదని తెలిపారు. ఈ వ్యాక్సిన్ భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ రాకుండా సుమారు 90 శా తం వరకు రక్షణ కల్పిస్తుందని పేర్కొన్నారు. మండలంలోని తల్లిదండ్రులు తమ ఆడపిల్లలకు తప్పనిసరిగా ఈ టీకా వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పవన్ కుమార్, డాక్టర్ పూజిత, పీహెచ్‌ఎన్‌ఓ మంగమ్మ, హెల్త్ సూపర్వైజర్లు ఆచా ర్యులు, లక్ష్మికుమారి, ఏఎన్‌ఎంలు సరళ, శ్రీదేవి, స్టాఫ్ నర్స్ పద్మ తదితర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.