నిజంసాగర్ మంజీరా తీర ప్రాంతాన్ని పరిశీలించిన సెంట్రల్ వాటర్ కమిషన్ డిప్యూటీ డైరెక్టర్స్
నాగిరెడ్డిపేట్,మే 20 (విజయ క్రాంతి):మండలంలోని నిజం సాగర్ బ్యాక్ వాటర్ మంజీర తీర ప్రాంతాన్ని సెంట్రల్ వాటర్ కమిషన్ డిప్యూటీ డైరెక్టర్ రూపేష్ మరియు సెంట్రల్ వాటర్ కమిషన్ అసిస్టెంట్ డైరెక్టర్ సంజీవ్ పరిశీలించారు.మండలంలోని మంజీర తీర ప్రాంతం గ్రామాలు అయినటువంటి తాండూర్,మాటూర్, మాసంపల్లి మరియు రుద్రారం గ్రామాల పరిధిలో గల మంజీరా నది వాగులో పేరుకుపోయినటువంటి ముండ్ల పొదలను,తుమ్మ చెట్లను తొలగించేందుకు స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు రెండు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించినందున ముళ్ళ పొదలను తొలగించనున్న
సందర్భంగా సెంట్రల్ వాటర్ కమిషన్ డిప్యూటీ డైరెక్టర్ రూపేష్, సెంట్రల్ వాటర్ కమిషన్ అసిస్టెంట్ డైరెక్టర్ సంజీవ్లు ఈప్రాంతాలను పరిశీలించడానికి వారు వచ్చినట్లు డిఈఈ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా డిఈఈ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... పనులు త్వరలో ప్రారంభించడం జరుగుతుందని ఈప్రాంతంలోని మంజీరా నదిలో వాటర్ 7 అడుగులలో ఉందన్నారు.టెండర్ కూడా జరిగాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో డీఈఈ వెంకటేశ్వర్లు,ఏఈఈ అక్షయ్ కుమార్ తదితరులు ఉన్నారు.






