ఎకరానికి ఎంత దిగుబడి వస్తే అన్ని జొన్నలు కొనాలి
కొండాపూర్‌లో రైతుల రాస్తారోకో
కామారెడ్డి, మే 20 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో జొన్నల కొనుగోలులో ఆంక్షలు విధించడం నిరసిస్తూ బుధవారం కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కొండాపూర్ లో జొన్న రైతులు రాస్తారోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఎకరాకు జొన్నలు ఎంత దిగుబడి వస్తే అన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం లో ఎకరానికి ఎన్ని కింటల్లా జొన్నలు దిగుబడి అయితే అన్ని కొనాలని భారత రాష్ట్ర సమితి నాయకులు బుధవారం డిమాండ్ చేశారు. సదాశివనగర్ మండలం పద్మాజివాడి చౌరస్తాలో తనను కలిసిన రైతులతో మాట్లాడుతూ ఉమ్మడి మండల మాజీ జెడ్పిటిసి పడిగెల రాజేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రైతు పండించిన పంటను మధ్య దళారీల పాలు కాకుండా గిట్టుబాటు ధరకు పూర్తిస్థాయి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రైతులను దగా చేయడానికి జొన్నలు మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రకటించడం ఎంతవరకు సమంజసంమన్నారు. ఒకవైపు రైతు ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పంటలు కొనుగోలు చేస్తున్నామని ప్రకటిస్తూనే మరోపక్క మధ్య దళారులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం వ్యవహరించడం అన్యాయం అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఎకరాన ఎన్ని కింటలు దిగుబడి సాధిస్తే ఆ పంటను మొత్తం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు లేనియెడల రైతులతో కూడి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకుడు ఉంటా నరసారెడ్డి, ఐ రాజయ్య, దస్తగిరి, వజ్జేపల్లి మల్లయ్య, భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






