14 June, 2026 | 4:15 PM

Breaking News

ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శికి ఘన సన్మానం   •   ఆసిఫాబాద్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి   •   ఎమ్మెల్యే.. కలెక్టర్ ల చొరవ.. రెండు నెలల్లో వంతెన పనులు పూర్తి   •   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిస్తేనే అభివృద్ధి సాధ్యం: మంత్రి బండి సంజయ్ కుమార్   •   సుల్తానాబాద్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చొప్పరి సుమన్   •   రాష్ట్ర కమిటీలో నైతం కృష్ణారావు చోటు   •   కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎర్రగుంట సర్పంచ్   •   మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల పండుగ   •   రేవంత్ రెడ్డి పాలన ఫస్ట్ ఆఫ్ అట్టర్ ఫ్లాప్: కేటీఆర్   •   రక్తదానం చేసిన సాయి కిషోర్ గౌడ్   •  

సెల్ఫ్‌హెల్ప్ గ్రూప్‌లకు సెంట్రల్ బ్యాంక్ చేయూత

08-12-2025 12:43 AM

హైదరాబాద్, డిసెంబర్ ౭(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు(సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌లకు) తమ బ్యాంక్ ఆర్థిక సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తుందని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజడ్‌హెచ్, హైదరాబాద్ ఎంవీఎస్ ప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మహిళల ఆర్థికాభివృద్ధికి తమ బ్యాంక్‌లో పొదుపు చేసు కునే సౌలభ్యం, రుణాలు అందజేయడం లాంటి సౌకర్యాలు కల్పించనున్నామన్నారు. ఈ మేరకు ఆదివారం సెంట్రల్ బ్యాంక్ జోనల్ హెడ్ ధారాసింగ్ నాయక్ సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పోవర్ట్రీ(ఎస్‌ఈఆర్‌పీ), తెలంగాణ సీఈఓ దివ్య దేవ రాజన్‌తో ఒప్పందం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.