నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం
DYFI ఖమ్మం డివిజన్ కార్యదర్శి, రావులపాటి నాగరాజు
రఘునాథపాలెం,(విజయక్రాంతి): ఖమ్మం డివిజన్ ఆదివారం స్థానిక సుందరయ్య భవనంలో డీవైఎఫ్ఐ డివిజన్ కమిటీ సమావేశం, DYFI ఖమ్మం డివిజన్ అధ్యక్షులు కూచిపూడి నరేష్ అధ్యక్షతన, జరిగిన ఖమ్మం డివిజన్ కమిటీ సమావేశంలో డీవైఎఫ్ఐ (DYFI) ఖమ్మం డివిజన్ కార్యదర్శి, రావులపాటి నాగరాజు మాట్లాడుతూ, ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకుండా నిరుద్యోగులను బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు మోసం చేస్తోందని అన్నారు. ఎన్నికలకు ముందు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని, అదేవిధంగా తక్షణమే ప్రభుత్వం ప్రకటించిన విధంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలి.
ఎన్నికల హామీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏడాదిలో రెండు కోట్లు రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన ప్రభుత్వాలు, ఆ దిశగా అడుగులు వేయడం లేదు. ఇప్పటివరకు కేవలం పాత నోటిఫికేషన్లకు నియామక పత్రాలు అందించారు తప్ప, కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా వేయలేదు. హైదరాబాద్ నగరంలో 'యూత్ డిక్లరేషన్' ప్రకటించి, దానిని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. అలాగే సమావేశంలో DYFI ఖమ్మం డివిజన్ అధ్యక్షులు కూచిపూడి నరేష్, మాట్లాడుతూ, నిరుద్యోగ యువతకు స్పష్టమైన హామీ ఇవ్వకపోతే, జిల్లా వ్యాప్తంగా డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.






