12 March, 2026 | 10:21 AM

జనగణన విధులను పక్కాగా నిర్వహించాలి

12-03-2026 01:34 AM

అడిషనల్ కలెక్టర్ పాండు

సంగారెడ్డి, మార్చి 11: జనగణన విధులను పక్కాగా నిర్వహించాలని, అప్పుడే ఆయా వర్గాల ప్రజలకు భవిష్యత్తులో కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ఒక అవగాహనకు వచ్చి కార్యాచరణను అమలు చేసేందుకు ఆస్కారం ఉంటుందని అడిషనల్ కలెక్టర్ పాండు సూచించారు.

సెన్సెస్ 2027 ను పురస్కరించుకుని జనా భా లెక్కల సేకరణ ప్రక్రియలో భాగస్వాములు అయ్యే తహసిల్దార్లకు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలకు  సంబంధిత శాఖల అధికారులకు బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ నెల 13వరకు మూడు రోజుల పాటు ఈ శిక్షణ కొనసాగనుండగా, హైదరాబాద్ నుండి వచ్చిన మాస్టర్ ట్రైనర్ అవగాహన కల్పిస్తున్నారు. జనాభా గణన కోసం ఎలా సన్నద్ధం కావాలి, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం తదితర అంశాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ 2011 లో చివరిసారి జనాభా గణన జరిగిందని తెలిపారు. ప్రస్తుతం సాంకేతికతను వినియోగిస్తూ, డిజిటల్ విధానంలో జనాభా లెక్కల సేకరణ జరిపేందుకు ప్రభు త్వ మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. చార్జ్ లెవె ల్ ఆఫీసర్లు ప్రతిరోజూ జన గణన ప్రక్రియ ను సమీక్షించాలని, తాము కూడా రోజువారీగా పర్యవేక్షణ జరుపుతామని అన్నారు.

అందుబాటులో ఉన్న సిబ్బందితో నిర్దేశిత గడువు లోపు జనాభా లెక్కల సేకరణ ప్రక్రియను మెరుగైన రీతిలో పూర్తి చేసేలా సన్న ద్ధం చేయాలన్నారు. ప్రణాళికల రూపకల్పన, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల రూపకల్పనకు దోహదపడే జన గణన ప్రక్రియను నిబద్ధత, అంకితభావంతో నిర్వహిం చాలని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉ మా హారతి,సిపిఓ బాలశౌరి, డిప్యూటీ సీఈ వో స్వప్న, ఆర్డీఓలు రాజేందర్, దేవుజ, డిఇ ఓ వెంకటేశ్వర్లు, డి సి ఓ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.