12 March, 2026 | 7:28 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

త్వరలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు

12-03-2026 01:32 AM

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, తుమ్మల వెల్లడి

ఖమ్మం, మార్చి 11 (విజయక్రాంతి): త్వరలో రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలపై తీపి కబురు చెపుతామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం ఖమ్మంలో జర్నలిస్టుల ఇండ్ల స్థలాల అంశం సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నదని, జిల్లా కేంద్రంతో పాటు మండలాల్లో పనిచేస్తున్న జర్నలిస్డులకు సైతం స్థలాలు ఇవ్వాలని, అర్హులకు ఇందిర మ్మ ఇండ్లు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఖమ్మం జిల్లా కమిటీ విజ్ఞప్తి మేరకు మంత్రులు స్పం దించారు. ముఖ్యమంత్రి ఇప్పటికే చెప్పారని, రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులకు త్వరలో తీపి కబురు అందిస్తామని అన్నారు.