3 September, 2026 | 9:21 AM

ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డుప్రమాదం

03-09-2026 | 08:06am

శంషాబాద్‌: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని ఔటర్ రింగ్ రోడ్డు (Outer Ring Road)పై గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ORRపై సిమెంట్ బస్తాలతో నిండిన లారీ కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ తృటిలో తీవ్రగాయాలతో  ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. సూర్యాపేటలోని కోదాడ నుండి మహారాష్ట్రలోని(Suryapet to Maharashtra) తులజాపూర్ వైపు TG29T3688 రిజిస్ట్రేషన్ నంబర్ గల లారీ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

'డయల్ 100'కు సమాచారం అందగానే రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (Rajiv Gandhi International Airport) పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పెట్రోలింగ్ పోలీసులు వాహనం లారీ డ్రైవర్ ను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, డ్రైవర్ వాహనం నడుపుతూ నిద్రమత్తులోకి జారుకుని, లారీని రెయిలింగ్‌కు ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.