బొల్లారంలో డిటోనేటర్ల కలకలం
బొల్లారం: మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంపు(Madras Regiment Army Camp) సమీపంలో డిటోనేటర్లు గుర్తించారు. ఫైరింగ్ రేంజ్ వెనుక గోడ సమీపంలో ప్లాస్టిక్ బకెట్ లో డిటోనేటర్లు బయటపడటం కలకలంగా మారింది. ప్లాస్టిక్ బకెట్ లో 8 బండిల్స్ లో 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు ఉన్నట్లు గుర్తించారు. ప్లాస్టిక్ బకెట్ లో 33A సైజ్ కమర్షియల్ ఎలక్ట్రిక్ డిటోనేటర్లు(Commercial electric detonators) లభ్యమయ్యాయి. ఒక్కో బండిల్ లో 20 డిటోనేటర్లు ఉన్నాయని, మొత్తం డిటోనేటర్లు విలువ రూ. 32 వేలు ఉంటుందని అధికారులు తెలిపారు.
ఆర్మీ(Army) సిబ్బంది సమాచారంతో బొల్లారం పోలీసులు(Bollaram Police) ఘటనాస్థలికి చేరుకున్నారు. డిటోనేటర్ల లభ్యంపై మల్కాజిగిరి బాంబ్ డిస్పోజల్ టీమ్(Malkajgiri Bomb Disposal Team) కు సమాచారం ఇచ్చారు. బాంబ్ డిస్పోజల్ టీమ్(Bomb disposal team) సూచనతో అధికారులు డిటోనేటర్లను భద్రపరిచారు. డిటోనేటర్లను అక్కడ వదిలి వెళ్లింది ఎవరనేదానపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులపై ఎక్స్ ప్లోసివ్ సబ్ స్టెన్సెస్ యాక్ట్ సెక్షన్ల(Explosive Substances Act Sections) కింద కేసు నమోదు చేశారు. ఇటీవల మాద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంపు(Army camp) కార్యాలయంలో ఆయుధాలు మిస్ అయినట్లు అధికారులు తెలిపారు. ఆయుధాలు మిస్సింగ్ తరుణంలో డిటోనేటర్లు లభ్యం కావడంతో హై టెన్షన్ నెలకొంది.






