15 May, 2026 | 8:19 PM

Breaking News

సెలవులకు ఇంటికి వచ్చిన విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలి   •   బాన్సువాడలో నూతన ఆర్డీఓ క్యాంప్ కార్యాలయం ప్రారంభం   •   పరీక్ష కేంద్రం వద్ద చల్లటి నీరు, అంబలి పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ బొడ్డు స్పందన గంగన్న   •   జవహర్ నవోదయ పాఠశాలకు భూమి స్వాధీనం.. రైతులతో చర్చించి సరిహద్దుల ఖరారు   •   ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి   •   మలిదశ ఉద్యమకారుల ముందస్తు అరెస్ట్   •   ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో ప్రత్యేక సమావేశం   •   ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం మార్చడం సిగ్గుచేటు   •   దొంగలు... బాబోయ్... దొంగలు...   •   చెంచుల జీవనోపాధికి టీజీఐఎల్పీ కీలకం   •  

రేపు హుజరాబాద్‌లో 'సంసద్ క్రీడా మహోత్సవం'

01-03-2026 07:32 PM

హుజురాబాద్,(విజయక్రాంతి): ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంకల్పంతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు సోమవారం కరీంనగర్ జిల్లాహుజరాబాద్ పట్టణంలో సంసద్ క్రీడ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు. ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సంసద్ క్రీడలను కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో హుజురాబాద్ నియోజకవర్గంలోని హుజురాబాద్ హై స్కూల్ గ్రౌండ్ ఆవరణలో సోమవారం ఉదయం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ క్రీడ మహోత్సవానికి  అసెంబ్లీ స్థాయిలోని యువజన సంఘాలు,డిగ్రీ అండ్ పీజీ కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొని ఆరోగ్యవంతమైన భారతదేశ నిర్మాణం కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ జిల్లా కోఆర్డినేటర్ మాడ వెంకట్ రెడ్డి, అసెంబ్లీ కో ఆర్డినేటర్లు చేన్నమాధని నరసింహరాజు, ఆకుల రాజేందర్, కనుమల గణపతి, పట్టణాధ్యక్షుడు తూర్పాటి రాజు, దొంతరవేణ రమేష్ యాదవ్, తిప్పబత్తిని రాజు, వెంకటేష్, మోటపోతుల రాకేష్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.