15 March, 2026 | 9:38 AM

వేడుకగా మహిళా దినోత్సవం

15-03-2026 01:38 AM

హైదరాబాద్, మార్చి 14 (విజయక్రాంతి): యువార్డ్ తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ఎన్జీవోస్ వర్కింగ్ ఫర్ ద చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ హైటెక్ సిటీ సంయుక్తంగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శనివారం హెలెన్ కెల్లర్స్ కళాశాల సిల్వర్ జూబ్లీ హాల్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ 320 ఏ గవర్నర్ డాక్టర్ జి మహేంద్ర కుమార్‌రెడ్డి, డిస్టిక్ సెక్రటరీ లయన్ తాళ్ల అంజయ్య, లయన్ పిఎస్‌ఎన్ రాజు, లయన్ జాజుల అంజయ్య హాజరయ్యారు.

యువార్డ్ స్టేట్ ఫెడరేషన్ చైర్మన్ లయన్ పటాన్ ఉమర్ఖాన్ విశిష్ట అతిథిగా విచ్చేశారు. దాదాపు 60 మంది ప్రత్యేక పాఠశాల ప్రతినిధులను సన్మానించారు. లయన్ మహేంద్ర కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో మహిళలు ముఖ్యంగా ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి విద్యార్థులకు సేవలను అందిస్తున్న ఉపాధ్యాయులందరికీ అభినందనలు తెలిపారు. 40 సంవత్సరాల నుండి ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని హెలెన్ కెల్లర్ సంస్థను లయన్ పటాన్ ఉమ ర్ ఖాన్‌కు అభినందించారు. కార్యక్రమానికి లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ హైటెక్ సిటీ ప్రెసిడెంట్ లయన్ లెనిన్ బాబు, సెక్రటరీ రాజేందర్, ట్రెజరర్ శ్రీధర్, గుంజా వెంకట్రావు, గౌస్ ముద్దిన్, సబ్బ రాజేందర్, యువార్డ్ సీఈఓ రాజ్ కుమార్, పాపారావు, కళ్యాణి పాల్గొన్నారు.