21 May, 2026 | 3:17 PM

Breaking News

తెల్ల తెల్లవారుతుండగానే పల్లెల్లోకి పాఠశాలల ప్రచారం.. విత్తన కంపెనీల ప్రచార రతాలు   •   ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి ఒక్కరికి క్రీడలు అవసరం   •   ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి..   •   ఆరోగ్యం బాగుంటేనే జీవితం సార్థకం   •   ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్   •   అనుమతి లేని ప్రైవేట్, విద్యాసంస్థలను మూసివేయాలి   •   కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టెన్త్ టాపర్ కు సైకిల్ బహుకరణ...   •   జైనూర్‌లో చలివేంద్రం – అంబలి పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •   బాన్సువాడలో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు...   •   ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు   •  

ఒక్క విద్యార్థి.. ఐదుగురు ఉద్యోగులు!

15-03-2026 01:39 AM

ఇంటర్ పరీక్ష సెంటర్‌లో అనూహ్య ఘటన

నాగర్‌కర్నూల్, మార్చి 14 (విజయక్రాంతి): నాగర్‌కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రంలో శనివారం అనూ హ్య ఘటన చోటుచేసుకుంది. పదమూడవ రోజు నిర్వహించిన పరీక్షకు జనరల్ విభాగంలో కేటాయించిన ఒక్క విద్యార్థి మాత్రమే ఉండగా, ఆ విద్యార్థి కూడా పరీక్షకు హాజరు కాలేదు. అయితే పరీక్షా నిబంధనల ప్రకారం కేంద్రంలో సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్, ఇన్విజిలేటర్, పోలీస్ సిబ్బంది తదితరంగా మొత్తం ఐదుగురు సిబ్బందితో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ సిబ్బంది అధికారులు విధులు నిర్వహించాల్సి వచ్చింది. చివరకు ఆ విద్యార్థి కూడా పరీక్షకు రాకపోవడంతో కేంద్రంలో సిబ్బంది ఖాళీగా విధులు నిర్వహించారు.