15 June, 2026 | 2:29 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

పాత పద్ధతిలో సీసీఐ పత్తి కొనుగోలు చేయాలి

04-11-2025 06:28 PM

బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఆవిడపు ప్రణయ్ కుమార్..

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ (విజయక్రాంతి): పత్తి కొనుగోలులో సీసీఐ విధించిన కొత్త నిబంధనలపై రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఆవిడపు ప్రణయ్ కుమార్ అన్నారు. సీసీఐ ద్వారా ఎకరాకు కేవలం ఏడు క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసే నిబంధనను వెంటనే రద్దు చేసి, గతంలా ఎకరాకు 12 క్వింటాళ్లు కొనుగోలు చేయాలని బీసీ యువజన సంఘం నాయకులతో కలిసి మంగళవారం జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రేకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆవిడపు ప్రణయ్ మాట్లాడుతూ రైతులు ఆరు నెలల కష్టానికి ప్రతిఫలంగా పండించిన పత్తిని ప్రకృతి వైపరీత్యాలు ఒకవైపు, సీసీఐ పరిమితి నిబంధనలు మరోవైపు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. గతంలో ఎకరాకు 12 క్వింటాళ్లు చొప్పున కొనుగోలు చేయగా, ఇప్పుడు ఏడు క్వింటాళ్లకే పరిమితం చేయడం వల్ల రైతులు క్వింటాలకు రూ.2000 వరకు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది అన్నారు.ఈ కార్యక్రమంలో  బీసీ యువజన సంఘం నాయకులు మెంగ్రే ఆకాష్, మేకర్తి అరుణ్, పిప్పిరి సమ్మన్నా, దాడి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.