15 June, 2026 | 3:12 PM

Breaking News

మెట్రో నిధులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు: సీఎం రేవంత్   •   తెలంగాణపై కేంద్రం తీవ్రమైన వివక్ష.. కిషన్ రెడ్డిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు   •   పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •  

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

04-11-2025 06:31 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ (విజయక్రాంతి): ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి(CMRF) ద్వారా మంజూరైన ఆర్థిక సహాయానికి సంబంధించిన 26 చెక్కులను ఎమ్మెల్యే కోవ లక్ష్మి మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి అనేది ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలుస్తోందన్నారు. అనారోగ్యం, ప్రమాదాలు లేదా అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ నిధి ఎంతో ఉపయోగకరంగా మారిందని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.