11 July, 2026 | 2:31 AM

శ్రీ రామలింగేశ్వర కాలనీలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

11-07-2026 12:31 AM

నాగోల్, జూలై 10 (విజయక్రాంతి): కొత్తపేట డివిజన్ శ్రీ రామలింగేశ్వర (ఎస్‌ఆర్‌ఎల్) కాలనీలో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మాజీ కార్పొరేటర్ నాయకోటి పవన్ కుమార్ సందర్శించి అధికారులతో కలిసి పనులను పరిశీలించారు. నిర్మాణంలో ఎలాంటి రాజీ లేకుండా నాణ్యమైన మెటీరియల్ వినియోగించాలని, రహదారి లెవెల్స్, డ్రైనేజీ వ్యవస్థ, నీటి పారుదల అంశాలను పరిగణనలోకి తీసుకుని పనులు చేపట్టాలని సంబంధిత అధికారులకు, సూపర్వైజర్ నరేష్కు సూచించారు.

పనులు నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. రోడ్డు నిర్మాణం ప్రారంభం కావడంతో కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఆర్‌ఎల్ కాలనీ అధ్యక్షుడు సుధాకర్, బీజేపీ కొత్తపేట డివిజన్ అధ్యక్షుడు మంచి రాజేష్ కుమార్, వెంకట్ రెడ్డి, కొత్త తిరుమల, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.