17 April, 2026 | 8:13 PM

Breaking News

సీసీ రోడ్డు పనులు ప్రారంభం

17-04-2026 06:35 PM

ఆర్మూర్,(విజయక్రాంతి): ఆర్మూర్ పట్టణంలోని 30వ వార్డులో సీసీ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులను అర్మూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ కాటిపల్లి వెంకట్ రెడ్డి, 30వ వార్డు కౌన్సిలర్ గుంజాల పృథ్వీ రాజ్ లు ప్రారంభించారు. కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్డ్ సమస్యల పరిష్కారం, అభివృద్దె ద్యేయంగా పని చేస్తున్నారు. అందులో బాగంగా  అయిదు లక్షల నిధులతో సిసి రోడ్డు పనులు ప్రారంభించడం జరిగిందన్నారు.

నీటి సమస్య పరిష్కారం కొరకు చాలా చోట్ల సొంత నిధులతో బోర్లు వేయించి నీటి సమస్య కొత్త వరకు పరిష్కరించామన్నారు. నిత్యం వార్డులో తిరుగుతూ పరిశుభ్రత ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా పని చేస్తామని అన్నారు. ప్రజలు చెత్తను చెత్త బండిలో వేసి తమ పరిసరాలు శుభ్రంగా ఉంచుకొని  సహకరించగలరని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కౌన్సిలర్ అజీమ్, వార్డు ప్రజలు పాల్గొన్నారు.