28 August, 2026 | 5:17 AM

దాడి కేసులో వ్యక్తి రిమాండ్

28-08-2026 02:39 AM

శంకర్‌పల్లి, ఆగస్టు 27 (విజయక్రాంతి): పాత కక్షల కారణంగా తమ్ముడు విస్లావత్ రవిపై కొడవలితో దాడి చేసిన శంకర్ అనే వ్యక్తిని మోకిలా పోలీసులు(Mokila Police) అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. పోలీసులు తెలపిన వివరాల ప్రకారం రవి పనుల్లో ఉండగా శంకర్ కొడవలితో దాడి చేయడంతో రవి ఎడమ భుజానికి తీవ్ర గాయమైంది. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు శంకర్ను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారికైనా కఠిన చర్యలు తప్పవని సీఐ శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు.