22 April, 2026 | 7:16 PM

Breaking News

గొర్రెల కాపరికి న్యాయం చేసిన పట్టణ సీఐ శివశంకర్   •   వేసవిలో ప్రజల దాహం తీర్చేందుకే చలివేంద్రాల ఏర్పాటు   •   గజ్వేల్ మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా వార్షికోత్సవం   •   జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్ అర్హత సాధించిన బెల్లంపల్లి సీఓఈ విద్యార్థులు   •   అకాల వర్షం – అన్నదాత ఆగమాగం   •   ప్రభుత్వ వైద్యసేవల్లో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదు: ఎమ్మెల్యే బిఎల్ఆర్   •   త్రిలింగ రామేశ్వర ఆలయాన్ని ఉమ్మడి జిల్లా సందర్శించిన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు   •   కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి: రవినాయక్   •   నకిలీ బిల్లులతో రూ.72 లక్షల దుర్వినియోగం   •   బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ఏర్పాటుకు కౌన్సిల్‌ తీర్మానం   •  

పేకాట ఆడుతున్న ఐదుగురిపై కేసు నమోదు

21-11-2025 07:51 PM

చిట్యాల,(విజయక్రాంతి): ప్రభుత్వం నిషేధించిన పేకాటను ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామని రామన్నపేట ఎస్సై డి నాగరాజు శుక్రవారం తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం...  రామన్నపేట గ్రామంలో ఎటువంటి అనుమతులు లేకుండా పేకాటను ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు రామన్నపేట ఎస్ఐ ఆదేశానుసారం పోలీసు కానిస్టేబుల్ ప్రవీణ్, ప్రశాంత్, అన్వర్, రవి, మహేష్ లు

కలిసి రామన్నపేట గ్రామ శివారు ప్రాంతంలోని ఐజిఎం చర్చ్ ఎదురుగా  పేకాట ఆడుతున్న రామన్నపేటకు చెందిన శివరాత్రి కుమార్(33) తండ్రి అంజయ్య, షేక్ యూసుఫ్(47) తండ్రి మధార్, చినపాక శ్రవణ్ (35)తండ్రి  యాదయ్య, వెరమల్ల నర్సింహ (57)తండ్రి  సైలూ, బుడ్డ లింగస్వామి(39) తండ్రి యాదయ్య లను పట్టుకొని  వారి దగ్గర నుండి 3 మొబైల్ ఫోన్ లను,1820 రూపాయలను స్వాదినం చేసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని రామన్నపేట ఎస్సై డి నాగరాజు తెలిపారు.