29 May, 2026 | 9:24 PM

నిజాం షుగర్ ఫ్యాక్టరీకై పోరాడిన నాయకులపై పెట్టిన కేసు కొట్టివేత

29-05-2026 04:09 PM

బోధన్:మే 29(విజయక్రాంతి): బీర్కూర్ శంకర్ , బి. మల్లేష్,, పుట్ట. వరదయ్య,లేట్ , వి. రాఘవులు. గుమ్ముల. గంగాధర్, జంబిశెట్టి.శంకర్, ఏషాల. గంగాధర్,  సుల్తాన్ సాయిలు, సింగం రాములు యాదవ్, . గోపి,  లేట్ షేక్ బాబు, లేట్ షేక్ ఫారుక్. తదితరుల పైన అక్రమంగా తప్పుడు కేసు పెట్టారు. ఈ విజయం ఫ్యాక్టరీ కోసం పోరాడిన రైతులది కార్మికులది ఇక్కడి ప్రజలది.

శుక్రవారం రోజున బోధన్ కోర్టులో 2018లో బోధన్ నిజాంషుగర్ ఫ్యాక్టరీ ని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో నాటి పాలకులు ఇచ్చిన హామీ ప్రకారం ఫ్యాక్టరీని ప్రారంభించాలని నిజాం సుగర్ రక్షణ కమిటీ మరియు తెలంగాణ సామాజిక పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు అమర నిరాహార దీక్షలు చేపట్టిన నాయకుల పైన అక్రమంగా తప్పుడు కేసులను పెట్టారు. అట్టి కేసు విషయములో కోర్టు చుట్టూరా 8 సంవత్సరాలుగా తిరుగుతున్న నాయకులపై పెట్టిన కేసులో పోలీసులు కోర్టుకు సాక్షాదారాలను ప్రవేశపెట్టనందున  విచారించినటువంటి కోర్టు ఫ్యాక్టరీకై పోరాడిన నాయకులు నిర్దోషులని  తీర్పు నివ్వడం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర సాధనకై జరిగిన మలిదశ ఉద్యమంలో రాష్ట్రం ఏర్పడితే బోధన్ ప్రాంతంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుని, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడిపిస్తామని వాగ్దానం చేసి, రాష్ట్రం ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన నాటి టిఆర్ఎస్ పార్టీ నడిచే ఫ్యాక్టరీని బంద్ చేసి ఈ ప్రాంత ప్రజలను మోసం చేసింది. అయితే 2018లో అసెంబ్లీకి జరిగే ఎన్నికలు నిజాం షుగర్ రక్షణ కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు తెలంగాణ దీక్షస్థల్ లో సుమారు 200 రోజులు జరిగాయి.

అట్లాగే సామాజిక తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అంబేద్కర్ చౌరస్తాలో ఆమర నిరాహార దీక్ష ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పు సంతోష్ నిర్వహించారు. మట్టి దీక్షలను నాటి ప్రభుత్వం పోలీసుల ఆధ్వర్యంలో భగ్నం చేశారు. దానికి నిరసనగా బోధన్ బంద్ కు పిలుపునిచ్చారు.  ఆ బందులో మేము ఇతరులకు ఇబ్బంది కలిగించామంటూ మాపై తప్పుడు కేసులను పెట్టారు. 8 సంవత్సరాల నుండి మేము ఆ కేసు విషయంలో కోర్టుకు తిరుగుతూ ఉన్నాము. మాపై పెట్టిన కేసులో పోలీసులు ఆధారాలను రుజువు చేయలేక పోయినందున అట్టి కేసును నేడు జడ్జి  కొట్టివేయడం జరిగింది. ఈ విజయం రైతులది, కార్మికులది బోధన్ ప్రజలది. నా వేదన వ్యక్తే పర్చారు.